: ఏపీకి ‘ఇతిహాద్’ అంతర్జాతీయ విమాన సర్వీసులు... సంస్థ వైస్ ప్రెసిడెంట్ తో చంద్రబాబు భేటీ
ప్రముఖ విమానయాన సంస్థ ఇతిహాద్ విమాన సర్వీసులు నవ్యాంధ్రకు తిరిగే రోజులు త్వరలోనే రానున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇతిహాద్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామితో భేటీ అయ్యారు. విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సదుపాయం కల్పించేందుకు పూనోసామి అంగీకరించారు. ఈ నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ అనుమతులు కోరతామని చంద్రబాబుకు ఆయన చెప్పారు. కాగా, సమీప భవిష్యత్తులో నవ్యాంధ్రకు వచ్చే ప్రయాణికులు హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకుండానే నేరుగా అక్కడికి చేరుకోవచ్చు.