: కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో బిజీగా 'చియాన్' విక్రమ్!
ప్రముఖ తమిళ నటుడు, తన విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన 'చియాన్' విక్రమ్, తన కుమార్తె అక్షిత పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. సీకే బేకరీ యజమాని రంగనాథన్ వారసుల్లో ఒకడైన మను రంజిత్ తో అక్షిత వివాహం నిశ్చయమైందని, వీరిద్దరి ఎంగేజ్ మెంట్ వచ్చే నెల 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో జరుగుతుందని తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుక కేవలం రెండు కుటుంబాల మధ్యే జరుగుతుందని, వచ్చే సంవత్సరంలో వైభవంగా వివాహ వేడుక ఉంటుందని విక్రమ్ సన్నిహత వర్గాలు తెలిపాయి. సమీప భవిష్యత్తులో వరుసగా విక్రమ్ చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అవుతుండటం, కారణంగానే వివాహం వచ్చే ఏడాది పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టులో 'కారికాలన్', ఆపై సెప్టెంబర్ లో 'ఇరు ముగన్' చిత్రాలతో విక్రమ్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.