: తిరుమలలో మోదీ బ్రదర్!... వెంకన్నను దర్శించుకున్న ప్రహ్లాద్ మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఏపీలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం నిన్న రాత్రే తిరుమలకు చేరుకున్న ప్రహ్లాద్ మోదీ... రాత్రి తిరుమలలోనే బస చేశారు. నేటి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా ఆయన వెంకటేశుడిని దర్శించుకున్నారు. ప్రధాని సోదరుడి హోదాలో వచ్చిన ప్రహ్లాద్ కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం పలకగా, టీటీడీ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.