: ‘అగస్టా’లో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు!... కాంగ్రెస్ కు డేంజర్ బెల్స్ మోగించిన పారికర్!


బీజేపీ ‘మిస్టర్ క్లీన్’, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగించారు. వీవీఐపీల కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో పాత్ర ఉన్న ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు నిన్న ఒడిశాలోని కటక్ లో జరిగిన ‘వికాస్ ఉత్సవ్’ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల మేర నిధులను నాటి యూపీఏ సర్కారులోని కీలక నేతలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముడుపులుగా స్వీకరించారని వార్తలు వినిపించిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపింది. కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. ‘‘ఈ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సాగిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిందితుల వెంటే ఉన్నారు. కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదు’’ అని పారికర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News