: హోంవర్కంటే పెద్ద తలనొప్పి!... చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న కోహ్లీ!
టీమిండియా చిచ్చరపిడుగు విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి జట్టు బెంబేలెత్తాల్సిందే. ఫార్మాట్ ఏదైనా అతడికి లెక్కే లేదు. బౌలర్ నుంచి విడుదలైన బంతిని బౌండరీకి ఎలా తరలించాలన్నదే తన కర్తవ్యంలా అతడు బ్యాటు ఝుళిపిస్తుంటాడు. ఐపీఎల్ సీజన్ తర్వాత మొన్నటి జింబాబ్వే టూర్ కు వెళ్లని ఈ టెస్టు జట్టు కెప్టెన్ కాస్తంత విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తన ఫ్యాన్స్ తో తన చిన్ననాటి అనుభూతులను పంచుకున్నాడు. స్కూలుకు సెలవంటే ఇక రోజంతా క్రికెట్టే ఆడేవాడినని అతడు తన చిన్ననాటి అల్లరిని గుర్తు చేసుకున్నాడు. అయితే సెలవు ముగిసిందంటే చేయాల్సిన హోంవర్క్ గుర్తుకు వస్తే మాత్రం తలనొప్పి వచ్చేసినట్లే ఫీలవుతానని అతడు చెప్పాడు.