: వైఎస్ జగన్ ఆటవిడుపు కంటిన్యూస్!... ఈ సారి ఫుట్ బాల్ తో కుస్తీ!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఇంకా కొనసాగుతోంది. నిత్యం రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యే జగన్... ఇటీవలే కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జీన్స్ ప్యాంట్, ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ తో పచ్చికబయళ్లపై గోల్ఫ్ స్టిక్ చేతబట్టి బంతిని బలంగా కొడుతున్న ఆయన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత చెస్ బోర్డు ముందు ఎత్తులు వేసే పనిలో లీనమై కనిపించారు. తాజాగా సోషల్ మీడియాలోకి ఆయన సరదాగా ఫుట్ బాల్ ఆడుతున్న ఫొటోలు వచ్చేశాయి. ఇద్దరు పిల్లలతో కలిసి నవ్వుతూ, తుళ్లుతూ కనిపిస్తున్న ఆయన జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ లోనే దర్శనమిచ్చారు.