: వచ్చే నెలలో లండన్ కు పవన్ కల్యాణ్!... ‘జయతే కూచిపూడి’కి ముఖ్య అతిథిగా జనసేనాధిపతి!


టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే నెల 9న విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ పర్యటనకు వెళుతున్న ఆయన అక్కడ ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాలకు హాజరవుతారు. తొలుత యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేష్ (యుక్తా) ఆధ్వర్యంలో జరుగుతున్న ‘జయతే కూచిపూడి’ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం యూకే, యూరప్ లోని తన అభిమానులు ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. 'యుక్తా'కు చెందిన గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News