: నేను గ్లామర్ బాయ్ ని కాదు, హ్యాండ్సమ్ నీ కాదు!: సినీ నటుడు బాబూమోహన్


‘నేను గ్లామర్ బాయ్ ని కాదు, హ్యాండ్సమ్ నీ కాదు’ అని ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి రావడం, మంచి పాత్రలు లభించడం, నిలదొక్కుకోవడం ఇవన్నీ తలచుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇవన్నీ తాను ఊహించనివని అన్నారు. ‘మనం ఊహించి ప్లాన్ చేస్తే జర్నీ అవుతుంది, కానీ, చిత్రరంగంలోకి నేను రావడం అలాంటి కాదు. ఇది ఒక కల. సరదాగా నాటకాల్లో వేషాలు వేసేవాడిని. దాని ద్వారా సినిమాల్లో వేషాలు వచ్చాయి’ అని బాబూ మోహన్ చెప్పారు.

  • Loading...

More Telugu News