: ఐఫా ఉత్తమ చిత్రం ‘బజరంగీ భాయీజాన్’


ఐఫా ఉత్తమ చిత్రంగా ‘బజరంగీ భాయీ జాన్’ అవార్డును సొంతం చేసుకుంది. ‘బాజీరావు మస్తానీ’ చిత్రం పలు విభాగాల్లో పలు అవార్డులు దక్కించుకుంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ, ఉత్తమనటుడుగా రణ్ వీర్ సింగ్ (బాజీరావు మస్తానీ), ఉత్తమనటిగా దీపికా పదుకొణె (పికు), ఉత్తమ కథా రచయితగా జుహి(పికు), ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్)గా మొనాలీ ఠాకూర్, ప్లే బ్యాక్ సింగర్ (మేల్)గా పపాన్, ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రియాంకచోప్రా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఛటర్జీ, ఉత్తమ ఎడిటింగ్.. శ్రీకర్ ప్రసాద్ (తల్వార్)తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డును బాజీరావ్ మస్తానీ చిత్రానికి గాను ప్రసాద్ సుతారా గెలుచుకున్నారు. ఐఫా వేడుకలకు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అమీషా పటేల్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె, అమీషా పటేల్ తదిరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News