: బ్రెగ్జిట్ పై బెట్ కట్టి రూ. 2 వేల కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!


యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతుందని బలంగా నమ్మిన ఆ వ్యక్తి 220 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగానే) జాక్ పాట్ కొట్టాడు. బ్రెగ్జిట్ గెలుస్తుందని, ఆపై బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు పౌండ్ విలువ భారీగా పతనమవుతుందని లండన్ కు చెందిన ఓ హెడ్జ్ ఫండ్ సంస్థ అధిపతి క్రిస్పిన్ ఓడే పందాలు కట్టాడు. పలు సర్వేలు బ్రెగ్జిట్ కు వ్యతిరేక ఫలితం వస్తుందని చెబుతున్నా వాటిని నమ్మని క్రిస్పిన్ తన మనసు చెప్పిన మాటలు నమ్మి విజయం సాధించాడు. రెఫరెండం తరువాత పౌండ్ విలువ మూడు దశాబ్దాల కనిష్ఠస్థాయికి పడిపోగా, బంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News