: షూటింగ్ లో శ్రద్ధాకపూర్ గాలికి గాయం
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ షూటింగ్ లో గాయపడింది. ఆమె తాజా చిత్రం ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని బాస్కెట్ బాల్ కోర్టులో జరుగుతుండగా ఆమె కాలికి గాయమైంది. ఈ విషయాన్ని శ్రద్ధాకపూర్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. కాగా, ఈ చిత్రంలో బాస్కెట్ బాల్ క్రీడాకారిణి పాత్రలో నటిస్తున్న శ్రద్ధాకపూర్ సరసన అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. చేతన్ భగత్ రాసిన పుస్తకం ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ నవల ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు.