: నాకు 50కు పైగానే ముద్దుపేర్లు ఉన్నాయి: విరాట్ కోహ్లీ


జట్టులోని సహచరులు ‘చీకు’ అని, ఇంట్లో వాళ్లు ‘వీరూ’ అని పిలుస్తుంటారని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. గుర్ గావ్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు 50 పైగానే ముద్దు పేర్లు ఉన్నాయని, తన శరీరంపై మొత్తం 8 టాటూలు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణం సాగిస్తున్న కోహ్లీ ఇంతవరకూ తాజ్ మహల్ ను చూడలేదని చెప్పాడు. తప్పులు అనేవి జరుగుతుంటాయని, అయితే, వాటిని ఎంత త్వరగా సరిదిద్దుకుంటే అంత మంచిదంటూ తన అభిమానులకు కోహ్లీ సూచన చేశాడు..

  • Loading...

More Telugu News