: 'దిస్ ఈజ్ అవర్ ఇండిపెండెన్స్ డే'... విజయాన్ని ప్రకటించుకున్న 'బ్రెగ్జిట్' అనుకూలవాది నైజిల్ ఫరాగే


యూరప్ కూటమి నుంచి బ్రిటన్ వైదొలగాలని గట్టి ప్రచారం చేసి ప్రజల్లో సెంటిమెంటును నింపిన నైజిల్ ఫరాగే తన విజయాన్ని ప్రకటించుకున్నారు. బ్రిటన్ వాసులు 'బ్రెగ్జిట్'కు ఓటు వేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. "దిస్ ఈజ్ అవర్ ఇండిపెండెన్స్ డే. యూనియన్ నుంచి బయటకు రావాలని అత్యధికులు భావిస్తుండటం భవిష్యత్తుకు, బ్రిటన్ చిన్నారులకు మేలు కలిగించే నిర్ణయం. ఇక ఈయూ నుంచి బయటకు రావాలని పార్లమెంటులో ఒత్తిడిని పెంచుతాం. ఓటమిని అంగీకరించి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయాలి" అని ఆయన అన్నారు. ఇది స్వాతంత్ర్యం కోరుకుంటున్న నిజమైన బ్రిటన్ వాసుల విజయమని, వలస వాదుల్లో అత్యధికులు అనుకూలంగా ఓట్లను వేసినందునే గెలుపు మార్జిన్ తక్కువగా ఉందని అన్నారు. జూన్ 23 బ్రిటన్ చరిత్రలో సువర్ణాధ్యాయమని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News