: సవాళ్లను స్వీకరించేందుకు నేనెప్పుడూ సిద్ధమే: టీమిండియా ప్రధాన కోచ్ కుంబ్లే
సవాళ్లను స్వీకరించేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ఎంపికైన స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే అన్నాడు. ఈ పదవికి ఎంపికైన తర్వాత తొలిసారిగా కుంబ్లే మీడియాతో మాట్లాడుతూ, మళ్లీ భారత జట్టుతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. భారత క్రికెట్ ఉన్నతికి పాటు పడేందుకు ఇదే తగిన సమయమన్నాడు. తనను ఈ పదవికి ఎంపిక చేసిన బీసీసీఐ, సలహా కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కమిటీతో పాటు ద్రవిడ్ తో చర్చించిన అనంతరం భవిష్యత్ ప్రణాళికను వివరిస్తానని కుంబ్లే పేర్కొన్నాడు.