: జర్మనీలోని సినీ కాంప్లెక్స్ లో ఆగంతుకుడి కాల్పులు... పలువురికి గాయాలు.. దుండగుడిని మట్టుబెట్టిన పోలీసులు!
జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ సమీపంలో ఉన్న వియర్నిహిమ్ టౌన్ సినీ కాంప్లెక్స్ లోకి ఓ ఆగంతుకుడు చొరబడి బీభత్సం సృష్టించాడు. విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో సుమారు 50 మంది వరకు గాయపడినట్లు జర్మన్ మీడియా పేర్కొంది. ముసుగులో ఉన్న ఆగంతుకుడు సినీ కాంప్లెక్స్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు. చివరికి పోలీసులు దుండగుడిని కాల్చిచంపారు.