: సాధారణ హెల్మెట్ కాదిది... ఆపదలో ఆదుకునే 'హెల్ప్ మెట్'!


శిరస్త్రాణం లేదా హెల్మెట్... ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వేళ, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే, తలకు గాయాలు కాకుండా కాపాడుతుంది. ఇక అదే హెల్మెట్ తన యజమానికి మరింత సాయం చేసేలా అత్యాధునికతను సంతరించుకుంటే... అదే 'హెల్ప్ మెట్'. ఓ థాయ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రమాదం జరిగిన వేళ, ఈ హెల్ప్ మెట్, బంధువులకు, పోలీసులకు, ఆంబులెన్స్ కూ సమాచారం పంపుతుంది. మీరు ఎక్కడ ప్రమాదంలో ఉన్నారో వారికి సూచిస్తుంది. ఓ సిమ్, జీపీఎస్ ఆధారిత స్మార్ట్ వ్యవస్థల ద్వారా ఇది పనిచేస్తుంది. దీనిలో రీచార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుందట. ఇందులోని సెన్సార్లు, బాహ్య గోడలపై పడే ఒత్తిడి ఆధారంగా పనిచేస్తాయి. బలమైన దెబ్బ తగిలితే, హెచ్చరికలను పంపుతుంది. ఇక దీన్ని మరింత ఆకర్షణీయంగా తయారు చేయాలని భావిస్తున్న సదరు థాయ్ సంస్థ, తమ అధికార వెబ్ సైట్ ద్వారా ద్విచక్ర వాహనదారుల నుంచి మరిన్ని సలహాలు కోరుతోంది. దీన్ని పూర్తి స్థాయిలో అభివద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావాలన్నది కంపెనీ ప్రయత్నం.

  • Loading...

More Telugu News