: కాలిఫోర్నియా నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థి మృతదేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియా వద్ద నదిలో నిన్న గల్లంతైన కృష్ణా జిల్లా విద్యార్థి పుట్టా నరేష్ మృతదేహం లభ్యమైంది. పడవ ప్రమాదంలో గల్లంతైన నరేష్ మృతదేహాన్ని నిన్న అర్ధరాత్రి మూడు గంటలకు కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నరేష్ మృతదేహాన్ని అతని స్వగ్రామమైన జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి పంపేందుకు కాలిఫోర్నియాలోని తానా సభ్యుడు వేమూరి సతీష్ అక్కడి ప్రభుత్వాధికారులతో చర్చలు జరుపుతున్నారు. నాలుగు రోజుల్లో అతని మృతదేహం స్వగ్రామానికి చేరనున్నట్లు నరేశ్ బంధువులు చెప్పారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం సాయపడాలని మృతుడి తల్లిదండ్రులు కోరారు.