: వాటి ముందు వ్యక్తిగత రికార్డులు ఏపాటివి?: డివిలియర్స్
సౌతాఫ్రికా జట్టు తరపున 200 వన్డేలు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పడంపై డివిలియర్స్ స్పందించాడు. తాను రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోనని, అందుకే వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదని అన్నాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో తనకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తమ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిందని చెప్పాడు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు స్నేహితులయ్యారని గుర్తు చేసుకున్నాడు. వాటన్నింటితో పోల్చితే ఈ వ్యక్తిగత రికార్డులు అంత గొప్పవి కాదని అన్నాడు. అయితే 200 వన్డేలు ఆడడమన్నది గొప్ప విషయమని పేర్కొన్న డివిలియర్స్, ఇంతకంటే మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నానని అన్నాడు.