: కసిమీదున్న టీమిండియా... పగ తీర్చుకునేనా?


జింబాబ్వేతో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో భాగంగా వన్డే సిరీస్ లో అంచనాలకు తగ్గట్టుగా రాణించి క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, ఆపై టీ-20 తొలి పోరులో విజయం ముందు బొక్కా బోర్లాపడగా, ఆపై కసితో ఉన్న జట్టు నేడు రెండో టీ-20కి సమాయత్తమైంది. జింబాబ్వేపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా నేడు జరిగే పోటీలో బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్ లో లభించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న జింబాబ్వే, తన దేశ క్రికెట్ చరిత్రలో రెండు మ్యాచ్ లకన్నా అధికంగా పోటీలున్న సిరీస్ ను తొలిసారిగా గెలవాలని భావిస్తోంది. ఇప్పటివరకూ కేవలం బంగ్లాదేశ్ పై మాత్రమే వరుసగా రెండు టీ-20 మ్యాచ్ లను గెలిచిన చరిత్ర ఉన్న జింబాబ్వే జట్టు అదే ఫీట్ ను ఇండియాపైనా నమోదు చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక భారత జట్టు తొలి మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో 8 పరుగులు చేయలేక చతికిలబడగా, బౌలింగ్ లో లోపాలూ కనిపించాయి. ఈ నేపథ్యంలో జట్టులో ఒకటి రెండు మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. ఉనద్కత్, చాహల్ ల స్థానంలో బరీందర్ శరణ్, కులకర్ణి రావచ్చని సమాచారం. ఈ మ్యాచ్ నేటి సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News