: ఆ బాల్ అద్భుతం... అందుకే ఓటమి: ధోనీ


జింబాబ్వేతో వన్డే సిరీస్ ను అద్భుత రీతిలో క్లీన్ స్వీప్ చేసిన ధోనీ సేన, తొలి టీ-20లో రెండు పరుగుల తేడాతో ఓటమి పాలై చతికిలపడగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఓటమిపై స్పందించాడు. ఆఖరి బంతికి తాము నాలుగు పరుగులు చేయాల్సి వుందన్న విషయాన్ని గుర్తు చేసిన ధోనీ, నేవిల్లీ మడ్జీవా వేసిన ఆఖరి బంతి అద్భుతమని, ఆఫ్ స్టంప్ కు ఆవల వెళుతున్న ఆ తరహా బంతిని బౌండరీకి పంపాలంటే చాలా కష్టమని చెప్పాడు. కాగా, ఆ బంతిని ధోనీ అటెంప్ట్ చేయగా, కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. మంచి మ్యాచ్ ఫినిషర్ గా గుర్తింపు తెచ్చకున్న ధోనీ క్రీజులో ఉండీ, గెలవలేక పోయిన భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాము సామర్థ్యానికి తగ్గట్టుగానే ఆడామని, గెలుపు, ఓటములను ముందుగానే ఊహించలేమని, టీ-20లో విజేతలుగా నిలవడం అంత సులువేమీ కాదని ధోనీ చెప్పుకొచ్చాడు. ఒత్తిడి మధ్య ఆఖరి బంతిని అద్భుతంగా వేసిన మడ్జీవాకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపాడు.

  • Loading...

More Telugu News