: ముందే కూసిన ఆర్బీఐ కోయిల!... 2018లో రావాల్సిన రూ.500 నోటు మార్కెట్లో ప్రత్యక్షం!

దేశ ఆర్థిక వ్యవస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)... వ్యవస్థలో కీలకమైన కరెన్సీ నోట్ల ముద్రణ బాధ్యతలను కూడా భుజాన వేసుకుని మోస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అత్యంత జాగరూకతకు తిరుగులేని సంస్థగా వినుతికెక్కింది. దేశంలోని హైదరాబాదు సహా వివిధ ప్రాంతాల్లో మింట్ కాంపౌండ్లను ఏర్పాటు చేసిన ఆ సంస్థ ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా వ్యవహరిస్తోంది. అయితే తమిళనాట నిన్న వెలుగుచూసిన ఓ ఘటన అటు ఆర్బీఐ అధికారులతో పాటు ఇటు జనాన్ని కూడా విస్మయపరచింది. సాధారణంగా ఆర్బీఐ కరెన్సీ నోట్లపై ఆ నోట్లు చెలామణిలోకి వచ్చిన సంవత్సరాన్ని ముద్రిస్తుంది. అయితే నిన్న చెన్నైలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం అధికారికి ఓ మీడియా సంస్థ నుంచి ఓ షాకిచ్చే ప్రశ్న ఎదురైంది. 2018లో విడుదల కావాల్సిన రూ.500 నోట్లు అప్పుడే చెలామణిలోకి ఎలా వచ్చేశాయని అడగడం జరిగింది. దీనిపై తమకు ఇప్పటిదాకా ఫిర్యాదు అందలేదని చెప్పిన సదరు ఆర్బీఐ అధికారి... ఈ వ్యవహారంపై సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారట. అయితే దేశంలో పెద్ద ఎత్తున చెలామణిలో ఉన్న దొంగ నోట్లలోనే సదరు నోట్లు చక్కర్లు కొడుతున్నాయన్న వాదనా లేకపోలేదు.

More Telugu News