: నా టీమ్ పనితనమే నన్ను ఉన్నత స్థాయిలో నిలిపింది!: రెహమాన్
ఇంతమంది అభినందనలకు, పొగడ్తలకు అర్హుడ్నో కాదో తెలియదని ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్.రెహమాన్ అన్నారు. హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో జరిగిన సాహసమే శ్వాసగా సాగిపో ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, వేదికపై ఇంతమంది తనను అభినందించారని, వాటన్నింటికీ తానొక్కడినే కాదని, తనకో టీముందని, వారందరి పనితనం తనను ఉన్నత స్థాయిలో నిలిపిందని అన్నారు. ఈ రోజు తనకు అందుతున్న ప్రశంసలన్నీ తనతో పని చేసిన ఎంతో మంది అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడం వల్ల వచ్చినవేనని ఆయన అన్నారు. పాటలన్నీ అందర్నీ ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.