: పీసీబీకి మంచి రోజులు వస్తాయి: మిస్బావుల్ హక్


పాకిస్థాన్ క్రికెట్ కు పునర్వైభవం వస్తుందని ఆ జట్టు టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కరాచీలో మిస్బా మాట్లాడుతూ, ఇంగ్లండ్ తో సిరీస్ పెద్దదని అన్నాడు. ఈ పర్యటనతో పాక్ క్రికెట్ కు ఎంతో లాభం చేకూరుతుందని పేర్కొన్నాడు. సిరీస్ ను గెలుచుకునేందుకు ఇంగ్లండ్ వెళ్తున్నామని మిస్బా తెలిపాడు. కాగా, పాక్ క్రికెట్ పతనం అంచున నిలబడ్డ సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ ఆ జట్టులో ప్రతిభను దెబ్బతీయగా, 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాద దాడి తరువాత ఆ దేశంలో ఆడేందుకు ఏ జట్టూ ముందుకు రాకపోవడంతో ఆదాయం లేక అల్లాడిపోతోంది. భారత్ తో ఆడేందుకు ప్రయత్నించినా రెండు దేశాల మధ్య వున్నా రాజకీయ వివాదాల నేపథ్యంలో భారత్ ఒప్పుకోవడం లేదు. దీంతో ఆ జట్టుతో ఆడేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

  • Loading...

More Telugu News