: పవిత్ర రంజాన్ మాసంలో పిలవగానే వచ్చిన రెహమాన్ గారికి ధన్యవాదాలు: దర్శకుడు గౌతమ్ మీనన్


'సాహసమే శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా మరోసారి రెహమాన్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ సినిమా దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలిపాడు. హైదరాబాదులో నిర్వహించిన ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో తాము పిలవగానే రావడం రెహమాన్ గొప్పతనానికి నిదర్శనమని, అందుకు కృతజ్ఞతలని అన్నాడు. ఆయన విలువైన సమయాన్ని వేస్టు చేయమని చెప్పిన ఆయన, ఆయన ఇచ్చిన అద్భుతమైన పాటలకు మంచి రూపం ఇచ్చామని భావిస్తున్నానని అన్నారు. నాగచైతన్య తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు చిత్రాన్ని తీసుకువస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News