: రేపు తొలి టీట్వంటీ...మళ్లీ కుర్రాళ్లే కీలకం


జింబాబ్వే టూర్ లో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. వన్డేల్లో సత్తాచాటిన యువ ఆటగాళ్లు టీ20లకు సిద్ధమవుతున్నారు. టోర్నీలో వారే కీలకం కానున్నారు. జింబాబ్వే ఆటగాళ్లపై విరుచుకుపడి జట్టులో సుస్థిర స్థానం కోసం పోటీలో ఉన్నామని చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టూర్ లో రాణిస్తే... ఎప్పుడైనా ఓ ఛాన్స్ తలుపుతట్టే అవకాశం ఉండడంతో ఆటగాళ్లంతా సత్తాచాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో వన్డే సిరీస్ ను కోల్పోయిన జింబాబ్వే జట్టు కొత్త ఆటగాళ్లతో టీ20లు ఆడనుందని సమాచారం. టీట్వంటీల్లో ఫేవరేట్ గా భారత్ దిగుతున్నప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్ లో అద్భుతాలు సాధ్యమేనని గత రికార్డులు చెబుతున్నాయి. రేపు సాయంత్రం 4:30 నిమిషాలకు తొలి టీట్వంటీ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News