: రజనీకాంత్ అనారోగ్యం వార్తలన్నీ అవాస్తవాలు...: సూపర్ స్టార్ కార్యాలయం ప్రకటన
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఓ వెబ్ సైట్ రాసిన కథనంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రజనీ కాంత్ ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది. రజనీ కాంత్ ఎలాంటి అనారోగ్యంతో బాధపడడం లేదని, ఏ ఆసుపత్రిలోనూ చికిత్స పొందలేదని, ఆ వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. 'రోబో 2.0' సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు రజనీ కాంత్ కొత్త ఉత్సాహంతో సిద్ధమవుతున్నారని తెలిపింది. అలాగే రజనీ కాంత్ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేసిన వెబ్ సైట్ పై చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.