: మలేసియాలో ఎంజాయ్ చేస్తున్నా: వీవీఎస్ లక్ష్మణ్
చక్కని ఆటతీరుతో భారత్‌కు ఎన్నో విజయాలందించిన టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా మలేసియాకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-9లో ఆయన హైదరాబాద్ జట్టుకి మార్గదర్శకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనకు కాస్త విశ్రాంతి దొరకడంతో ఆయన మలేసియాకు వెళ్లి అక్కడి పలు పర్యాటక ప్రాంతాల్లో తన భార్యపిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. ‘మలేసియాలో కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్ చేస్తున్నాను’ అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడి పలు ప్రాంతాల్లో తన భార్యాపిల్లలతో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు.