: ఫేస్ బుక్ మెసింజర్ ఉంటే ఎలాంటి ఫోన్ కైనా ఎస్ఎంఎస్
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు వాడుతూ, సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ అందిస్తున్న మెసింజర్ యాప్ వాడుతున్న వారందరికీ శుభవార్త. మెసింజర్ యాప్ ను వాడుతూ, ఏ ఫోన్ కైనా ఎస్ఎంఎస్ పంపే సదుపాయం అందుబాటులోకి రానుంది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ విభాగం) డేవిడ్ మార్కస్ ఈ విషయాన్ని తెలిపారు. కాగా, మూడేళ్ల క్రితం ఇదే సదుపాయాన్ని ఫేస్ బుక్ అందించగా, అప్పట్లో స్మార్ట్ ఫోన్ల వాడకం తక్కువగా ఉన్న కారణంగా పెద్దగా ఆదరణ లభించలేదు. ఇక ఇప్పుడు ఈ ఫీచర్ ను మరింతగా మార్చి వివిధ రకాల ఎమోజీలు, చిన్న చిన్న వీడియోలతో పాటు లొకేషన్ షేరింగ్ వివరాలను పంచుకునే వీలును ఫేస్ బుక్ కల్పించాలని నిర్ణయించింది.