: మాల్యా ‘ప్రొక్లెయిమ్ డ్ అఫెండరే’!... ప్రకటించిన పీఎంఎల్ఏ కోర్టు!
బ్యాంకులకు వేలాది కోట్ల మేర రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పలు అరెస్ట్ వారెంట్లతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆయనను‘ప్రొక్లెయిమ్ డ్ అఫెండర్’ గా ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను నిన్న విచారించిన ముంబైలోని సదరు కోర్టు... మాల్యాను ప్రొక్లయిమ్ డ్ అఫెండర్ గా ప్రకటించింది. దీంతో మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో నెలలోగా మాల్యా కోర్టు ముందు హాజరుకాక తప్పదు. లేనిపక్షంలో ఆయనను తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది.