: బిచ్చగాడిగా మారి రూ. 128 సంపాదించిన కన్నడ నటుడు శరణ్
కన్నడ నాట పేరున్న హాస్య నటుడు, హీరో శరణ్, కళ్లకు అద్దాలు, తలకి విగ్గు, ముఖానికి గడ్డం తగిలించుకుని రోడ్డు పక్కన ఓ పట్ట పరుచుకుని పాటలు పాడుతూ అడుక్కున్నాడు. పక్కన మరో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు వాద్య సహకారాన్ని కూడా అందిస్తుంటే, శరణ్ పాటలకు అడపాదడపా కొంత చిల్లర కూడా పడింది. మొత్తం రూ. 128 వచ్చాయని శరణ్ స్వయంగా వెల్లడించాడు. దీన్నంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా, ఇప్పుడది హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఇలా ఎందుకు చేశాడో తెలుసా? తాను నటిస్తున్న తాజా చిత్రం 'నటరాజ సర్వీస్' ప్రమోషన్ కోసమట!