: 'బాహుబలి 2' క్లైమాక్స్ తొలిరోజు ఇలా ప్రశాంతంగా గడిచిపోయింది: రాజమౌళి
'బాహుబలి 2' క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించిన తరువాత తొలిరోజు షూటింగ్ విశేషాన్ని ఆ సినిమా దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. యుద్ధం ముగిసిన తరువాత రాజు అందరికీ అభివాదం చేస్తుండగా... ఆయన చెయ్యి ముందు తనతో పాటు యూనిట్ సభ్యులంతా కలసి అభివాదం చేస్తున్న ఫొటోను రాజమౌళి పోస్ట్ చేశాడు. "మొదటి రోజు యుద్ధ సన్నివేశాల షూటింగ్ చాలా బాగా జరిగింది. నెలల కొద్దీ చేసిన ప్లానింగ్ చాలా ఉపయోగపడింది. అంతా చాలా ప్రశాంతంగా సాగిపోయింది. జై మాహిష్మతి" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. కాగా, బాహుబలి 2కి సంబంధించిన విశేషాలను ఎవరితోనూ పంచుకోవద్దని యూనిట్ సభ్యులకు ఆర్డర్ జారీచేసిన రాజమౌళి స్వయంగా ఫొటో ట్వీట్ చేయడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.