: నిజజీవితంలోనే కాదు.. రీల్ లైఫ్లోనూ బాబాయ్, అబ్బాయ్లుగా అనిల్ కపూర్, అర్జున్ కపూర్

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, అర్జున్ కపూర్ ప్ర‌ధాన పాత్రధారులుగా కామెడీ, డ్రామా, రొమాన్స్ ఎలిమెంట్స్తో తెర‌కెక్క‌నున్న కుటుంబ క‌థా చిత్రం ‘ముబారక’. ఈ ఇద్ద‌రు న‌టుల మ‌ధ్య‌ నిజ‌జీవితంలో ఉన్న బాబాయ్, అబ్బాయ్ బంధమే ఈ సినిమాలో కూడా క‌న‌ప‌డ‌నుంది. అనిల్ క‌పూర్ బాబాయ్‌గా, అర్జున్ క‌పూర్ అబ్బాయ్‌గా ఈ సినిమాలో క‌నిపించి అల‌రించ‌నున్నారు. నిజ‌జీవితంలో ఉన్న రిలేష‌న్ షిప్పే సినిమాలోనూ రిపీట్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ వస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తోంది. నిర్మాత బోనీ కపూర్కు కుమారుడు అర్జున్ కపూర్. బోనీ కపూర్, అనిల్ కపూర్ సోద‌రులన్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో షూటింగ్ ప‌నులు ప్రారంభించ‌బోతున్న‌ ‘ముబార‌క’ సినిమాకు మిగ‌తా క్యారెక్ట‌ర్ల కోసం న‌టుల‌ను అన్వేషించే ప‌నిలో చిత్ర బృందం ఉంది.

More Telugu News