: సల్మాన్ ను కట్టడి చేసిన ప్రియురాలు యులియా!


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఆమె ప్రియురాలు యులియా వాంతూర్ గుప్పెట్లో పెట్టుకుందని బాలీవుడ్ లో వార్తలు వినపడుతున్నాయి. ఆమెకు ఇష్టంలేని వారితో సల్మాన్ ను దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఆమెతో సహజీవనం చేస్తున్నట్టు నిర్ధారించిన ఓ పత్రిక కధనం ప్రకారం, 'జైహో' సినిమాలో సల్మాన్ తో కలసి నటించిన డైసీ షాను ఆమె దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. 'జైహో' సినిమాతో సల్మాన్ డైసీ షాకు లైఫ్ ఇచ్చాడు. దీంతో డైసీ సల్మాన్ నివాసంలో కుటుంబ సభ్యురాలిలా కలిసిపోయింది. అయితే, ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో, ఆఫర్లు లేని సమయంలో 'హేట్ స్టోరీ 3'లో మళ్లీ ఆమెకు సల్మాన్ అవకాశం ఇప్పించాడు. ఈ విషయాన్ని గతంలో డైసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె వ్యవహారం నచ్చని యులియా ఆమెను దూరం పెట్టిందని బాలీవుడ్ టాక్. అందుకే దుబాయ్ లో షో తరువాత సల్మాన్ కనీసం ఆమెను కలవలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన స్నేహితులు తొందరగా పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని డైసీ పేర్కొందని మీడియాలో వార్తలొస్తున్నాయి.

  • Loading...

More Telugu News