: మా ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలున్నా పిల్లల కోసం వాటిని పక్కన పెట్టాల్సిందే: హృతిక్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నుంచి విడిపోయిన తరువాత తమ బంధం గురించి పెద్దగా మాట్లాడని సుసాన్నే ఖాన్ తొలిసారి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తామిద్దరం జీవితంలో ఓ స్థాయిని చూశామని చెప్పింది. ఆ స్థాయి దాటిన తరువాత కలిసుండకపోవడమే తమిద్దరికీ మంచిదనిపించిందని చెప్పింది. తమను తాము మభ్యపెట్టుకుంటూ తప్పుడు బంధంలో కలిసి ఉండడం కంటే నిజాయతీగా దూరంగా ఉండడమే సబబనిపించిందని తెలిపింది. తామిద్దరం ప్రస్తుతం కలిసి ఉండకపోయినా నిత్యం ఛాటింగ్ చేసుకుంటామని చెప్పింది. తాము విడిపోయినా తమ పిల్లల పట్ల కమిట్ మెంట్ తో ఉన్నామని స్పష్టం చేసింది. ఒకరిపట్ల ఒకరం పరస్పరం గౌరవంతో హాయిగా ఉన్నామని తెలిపింది. తమ మధ్య ఎన్ని విభేదాలున్నా పిల్లలను కాపాడుకునే విషయంలో అవన్నీ పక్కన పెట్టాల్సిందేనని సుస్సాన్నే ఖాన్ తెలిపింది.