: ఎన్ఎస్జీలో సభ్యత్వానికి భారత్ కంటే మా దేశానికే యోగ్యత ఎక్కువ: పాకిస్థాన్


అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వానికి అవసరమైన యోగ్యతకు సంబంధించి పాకిస్థాన్ సరికొత్త వాదన చేసింది. కూటమి సభ్యత్వం కోసం భారత్ కంటే తనకే అధిక యోగ్యతలున్నాయని ఆ దేశం వాదిస్తోంది. ఈ మేరకు ఆ దేశ ప్రధానికి విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్న సర్తాజ్ అజీజ్ నిన్న తనదైన శైలిలో కొత్త వాదన వినిపించారు. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్ఎస్జీలో సభ్యత్వమిచ్చే విషయంలో ఓ యూనిఫాం క్రైటీరియాను రూపొందిస్తే... అందులో భారత్ కంటే పాక్ కే అధిక యోగ్యతలు ఉంటాయని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం నాన్-ఎన్పీటీ దేశాలతో యూనిఫాం క్రైటీరియా కోసం యత్నిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. అప్పటిదాకా ఎన్ఎస్జీ సభ్యత్వం మాటెత్తని పాక్... భారత్ దరఖాస్తు చేసుకోగానే తాను ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ తో పాటు తమకూ ఎన్ఎస్జీలో సభ్యత్వమివ్వాలని ఆ దేశం కూటమిలోని పలు దేశాలతో రాయబారం నడుపుతోంది.

  • Loading...

More Telugu News