: తొలి మ్యాచ్ లోని టీమ్ కొనసాగింపు... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ


జింబాబ్వేతో హరారే మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్ ఆడిన టీమ్ నే కొనసాగించాలని నిర్ణయించుకున్నామని, పిచ్ పరిస్థితిని బట్టి, ఆరంభంలో వికెట్లు తీసి జింబాబ్వేను ఒత్తిడిలోకి నెట్టాలన్నదే తన గేమ్ ప్లాన్ అని ధోనీ వెల్లడించాడు. జింబాబ్వే జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ ఏజీ క్రీమర్ వెల్లడించాడు. క్రెయిగ్ ఇర్విన్ స్థానంలో సీన్ విలియమ్స్ ను తుది జట్టులోకి తీసుకున్నట్టు పేర్కొన్నాడు. కాగా, ఔట్ ఫీల్డ్ కొంత తడిగా ఉండటంతో టాస్ 10 నిమిషాలు ఆలస్యమైంది. మరికాసేపట్లో జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుని ఆపై జింబాబ్వేను వైట్ వాష్ చేయాలన్నది టీమిండియా వ్యూహం.

  • Loading...

More Telugu News