: నా కొడుకు ఇంత దారుణం చేస్తాడనుకోలేదు, క్షమించండి: ఒమర్ తండ్రి
అమెరికాలో తీవ్ర సంచలనం కలిగించిన ఒమర్ మతీన్ కాల్పుల ఘటనపై అతని తండ్రి, ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చి అమెరికాలో సెటిలయిన మీర్ సిద్ధిఖీ స్పందించాడు. ఎన్సీబీ చానల్ తో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఇంతటి దారుణం చేస్తాడని ఊహించలేదని, అమెరికా అంతటినీ దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై, జాతి మొత్తానికి తాము క్షమాపణలు చెబుతున్నామని అన్నాడు. గత నెలలో మియామీలో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకోవడం చూసిన తన కుమారుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని, అతని వ్యతిరేకతను మతపరమైన అంశంగా చూడవద్దని కోరాడు.