: ఉత్తమ టైమింగ్ తో రేస్ ముగించిన జమైకా చిరుత
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ మళ్లీ మెరిశాడు. గత కొన్నేళ్లుగా పరుగు పందాల టోర్నీలను మకుటంలేని మహారాజుగా ఏలుతున్న బోల్ట్ మరో ఘనత సాధించాడు. జమైకాలో జరిగిన రేసర్స్ గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్ మీట్ లో గాయం నుంచి కోలుకున్న ఉసేన్ బోల్ట్ తన సత్తా తగ్గలేదని నిరూపించాడు. 100 మీటర్ల రేస్ ను 9.88 సెకన్లలో పూర్తి చేసిన బోల్ట్ ఈ ఏడాది రెండో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేశాడు. యోహాన్ బ్లేక్ 9.94 సెకెన్లలో, అసాఫా పావెల్ 9.98 సెకెన్లలో రేస్ ను ఫినిష్ చేశారు.