: ‘మార్కో’లో తండ్రీకూతుళ్ల మ‌ధ్య ఉండే భావోద్వేగాల‌ను చూస్తారు: స‌ంజ‌య్ ద‌త్‌


షెల్లీ చోప్రా దర్శకత్వంలో నిర్మించ‌నున్న‌ ‘మార్కో’ మూవీతో బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంజ‌య్ ద‌త్ ఈ చిత్రం గురించి స్పందించారు. ముంబ‌యిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తాను న‌టిస్తోన్న సినిమా చాలా అంద‌మైన‌దిగా అభివ‌ర్ణించాడు. బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల మ‌ధ్య ఉండే అనుబంధాల‌ను, భావోద్వేగాల‌ను చూడొచ్చ‌ని ఆయ‌న పేర్కొన్నాడు. ఇందులో సంజూ గోవావాసిగా కనిపిస్తాడు. సంజ‌య్ ద‌త్ తాను జైలు నుంచి విడుద‌లైన త‌రువాత మ‌ళ్లీ ఈ చిత్రంతోనే త‌న సినీ జీవితానికి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ‘మార్కో’ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్టు ప‌ని చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ సినిమాలో సంజ‌య్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్‌ను కూడా చూడొచ్చు. చిత్ర షూటింగ్ గోవా, చెన్నైల్లో జ‌ర‌గ‌నుంది. సినిమాలోని మొద‌టి భాగం కోసం గోవాలో, రెండో భాగం కోసం చెన్నైలో షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు.

  • Loading...

More Telugu News