: ఆస్కార్ నా కల... కలలు కనడం ఆపను: మంచు లక్ష్మి
ఆస్కార్ అవార్డు సాధించడం తన కల అని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి తెలిపింది. ఓ టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, ఆస్కార్ వస్తుందా? రాదా? అన్నది అనవసరమని, దానిని లక్ష్యంగా చేసుకుని పని చేయడమే తన పని అని ఆమె చెప్పారు. తనపై వచ్చే జోకులు, రూమర్లు చూసి నవ్వుకుంటానని చెప్పింది. తమపై వచ్చే సెటైర్లను కూడా పాజిటివ్ గా తీసుకోగలగడమే జీవితం అని ఆమె తెలిపారు. తనకు నెగిటివిటీ నచ్చదని ఆమె అన్నారు. తన చుట్టూ పాజిటివ్ గా ఉండేవారే ఉంటారని లక్ష్మి చెప్పింది. తనకు ఎవరైనా నెగిటివ్ గా కనిపిస్తే వారి నుంచి దూరంగా జరిగిపోతానని తెలిపింది. అలాంటి వారితో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.