: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 128 పాయింట్లు నష్టపోయి 26,636 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టోయి 8,710 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో హిందాల్కో సంస్థ షేర్లు అత్యధికంగా 4.24 శాతం లాభపడి రూ.115.60 వద్ద ముగిశాయి. వీటితో పాటు లాభపడ్డ సంస్థల షేర్లలో యస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, ఏసీసీ, అంబుజా సిమెంట్ ఉన్నాయి. నష్టాలతో ముగిసిన వాటిలో టాటా మోటార్స్ డీవీఆర్, టాటా స్టీల్, టాటా మోటార్స్, కోల్ ఇండియా సంస్థల షేర్లు ఉన్నాయి.