: 12న గుంటూరులో ‘అ..ఆ’ విజయోత్సవ వేడుకలు... సందడి చేయనున్న నితిన్, సమంత
ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై, మంచి టాక్ సంపాదించుకున్న చిత్రం ‘అ..ఆ’. ఈ సందర్భంగా ఈ చిత్రం విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ‘అ..ఆ’ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన గుంటూరులోని సిద్ధార్ధ గార్డెన్స్ లో సాయంత్రం ఏడు గంటలకు ఈ వేడుకలు జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షత వహించనున్నారన్నారు. ఈ చిత్రం హీరోహీరోయిన్లు నితిన్, సమంత, నరేష్, రావు రమేష్, నదియ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొననున్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు.