: ఏపీ స్థానికత ఫైల్ పై రాష్ట్రపతి సంతకం
ఆంధ్రప్రదేశ్ స్థానికత ఫైల్ పై రాష్ట్రపతి ఈరోజు సంతకం చేశారు. తెలంగాణలో స్థిరపడి ఏపీకి వెళ్లేవారికి స్థానికత వర్తించే విధంగా ఉత్తర్వులను సవరించారు. ఈమేరకు ఏపీలో స్థానికతపై కేంద్ర ప్రభుత్వం నాలుగు పేజీల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఎంతో కాలంగా స్థిరపడ్డ ఉద్యోగులు, సామాన్య ప్రజలకు సంబంధించి ఏపీలో స్థానికత అంశంపై స్పష్టత వచ్చింది. 2017 జూన్ 2 లోపు ఏపీకి తిరిగి వచ్చేవారికి స్థానికతను వర్తింపజేయనున్నారు. తాము కోరుకున్న జిల్లాలో స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని గతేడాది అక్టోబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఫైల్‌ను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం పంపిన విషయం తెలిసిందే.