: అజ్ఞాతంలో లేడీ డాన్ సంగీతా చటర్జీ!... కోల్ కతాను జల్లెడ పడుతున్న చిత్తూరు ఖాకీలు!

శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటించడంలో తనదైన శైలిలో చక్రం తిప్పి లేడీ డాన్ గా ఎదిగిన సంగీతా చటర్జీ చిత్తూరు జిల్లా పోలీసులకు ఝలక్కిచ్చింది. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా వెళ్లిన చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినా... తనదైన శైలిలో చక్కం తిప్పి బెయిల్ తీసుకున్న సంగీత ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయింది. సంగీతాను చిత్తూరు కోర్టుకు తీసుకువస్తున్నామంటూ జిల్లా పోలీసులు ప్రకటించినా... ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు పడలేదు. తాజాగా చిత్తూరు కోర్టు నుంచి సంగీతాపై అరెస్ట్ వారెంట్లు తీసుకుని పోలీసులు కోల్ కతా వెళ్లారు. అయితే అక్కడ ఆమె జాడ కనిపించకపోవడంతో పోలీసులు కోల్ కతా నగరాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు చెందిన బ్యాంకు లాకర్లను పోలీసులు తెరిచారు. వీటిలో 2.5 కిలోల బంగారం, పలు కీలక డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సంగీత కోసం వేట సాగిస్తున్నారు.

More Telugu News