: చైనాలో పరీక్ష కేంద్రాల్లో తనిఖీలకు ప్రత్యేక టీంలు.. పట్టుబడితే కఠిన చర్యలే
పరీక్షల్లో విద్యార్థులు భారీగా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని వస్తోన్న ఆరోపణలతో చైనా ప్రభుత్వం కదిలింది. ఇటీవల పరీక్ష పత్రాలు అక్కడి పలు వీధుల్లో అమ్ముడు పోతూ పోలీసులకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇకపై అటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఆషామాషీగా కాకుండా విద్యార్థుల పరీక్షల నిర్వహణ తనిఖీలకు ప్రత్యేక టీంలనే రంగంలోకి దింపింది. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పరీక్షలకు ఎస్డబ్ల్యూఏటీ అనే ప్రత్యేక పోలీసు టీంలను నియమించింది. విద్యార్థులు పరీక్షల్లో ఏమైనా మోసాలకు పాల్పడుతున్నారా..? అనే అంశంపై తనిఖీ నిర్వహించి వెళ్లి పోవడమే కాకుండా విద్యార్థులకు పరీక్ష పేపర్లను అందించే పనిని కూడా ఈ ప్రభుత్వం ఈ టీం కే అప్పజెప్పింది. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఎనిమిది మందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక టీం తమ విధులు నిర్వహించనున్నాయి. మోసాలకు పాల్పడుతూ విద్యార్థులు ఈ టీంకి చిక్కితే బెదిరించడాలు, పరీక్ష హాలు నుంచి బయటికి పంపించేయడాలు ఏమీ ఉండవు. ఏకంగా అరెస్టు చేసేస్తారు!