: ప్రపంచం ఏమనుకుంటుందన్నది మాకు అనవసరం: క‌్రిస్ గేల్
‘ప్రపంచం మొత్తం మా గురించి ఏమనుకుంటుందో మాకు అనవసరం’ అని వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తాను ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ ‘సిక్స్ మెషీన్’లో పేర్కొన్నాడు. క్రిస్‌గేల్ తనని తాను ప్రిసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాళ్లు బాల్‌లో రొనాల్డో , ఇబ్రమోవిచ్‌తో పోల్చుకున్నాడు. ఈ ఇరువురి ఆటగాళ్లతో పాటు తనని తాను ఛాంపియన్ వర్గానికి చెందిన వాడిగా అభివర్ణించుకున్నాడు. తమ శైలి, ఆటతీరు గురించి ప్రపంచం ఏమనుకుంటుందో తమకు అనవసరమని ఆయన పేర్కొన్నాడు. రికార్డుల కోసం పరితపించడం తమకు అలవాటు లేదని ఆయన తెలిపాడు. తమ మీద తమకు ఉన్న నమ్మకంతోనే మైదానంలోకి దిగుతామని ఆయన చెప్పాడు.