: టీటీడీ బోర్డు సభ్యుడిగా టీ టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి బాధ్యతల స్వీకరణ!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా టీ టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సికింద్రాబాదు కంటోన్మెంటు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్నను టీటీడీ బోర్డు సభ్యుడిగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నియమించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఆకర్ష్ కు చిక్కిన సాయన్న టీ టీడీపీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని టీటీడీ బోర్డు కాల పరిమితిని పొడిగిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్తర్వుల్లో అందరికీ పొడిగింపు ఇచ్చిన ప్రభుత్వం.. సాయన్నకు మాత్రం ఇవ్వలేదు. ఈ క్రమంలో సాయన్న స్థానంలో టీ టీడీపీకే చెందిన నేతకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావించారు. ఈ క్రమంలో మొన్న తిరుపతిలో జరిగిన టీడీపీ మహానాడులో సాయన్న స్థానంలో అరికెల నర్సారెడ్డిని నియమిస్తున్నట్లు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న అరికెల టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఆయన తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.

More Telugu News