: అమెరికన్ కవి మాటలకు మరో వాక్యం జోడించిన మోదీ
అమెరికా చట్టసభలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అమెరికన్ కవి వాల్ట్ విథ్మన్ చెప్పిన మాటలతో ముగిసింది. ‘సంగీతకారుడు తన చేతిలోని బేటన్ తో సంజ్ఞ చేయగానే, సంగీత వాయిద్య బృందం అందుకు అనుగుణంగా చక్కగా వాయిస్తుంది’ అనేవి ఆ కవి పలుకులు అని, అయితే, దానికి ఇంకొక వాక్యం తాను కలుపుతానని.. ‘ఆ ప్రదర్శనలో కొత్త స్వరసమ్మేళనం’ ఉండాలని మోదీ అనడంతో సెనేట్ సభ్యుల చప్పట్లు మార్మోగిపోయాయి.