: మోదీతో కరచాలనానికి ఉత్సాహం చూపిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు


యూఎస్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అద్భుతమైన స్పందన లభించింది. అమెరికా, భారత్ మధ్య సారూప్యతలను గుర్తు చేసిన మోదీ, ఈ రెండు దేశాలు కలసి ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యలపై పోరాటం చేసిన విధానాన్ని కొనియాడారు. దీంతో ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఆద్యంతం ఆస్వాదించారు. ఆయన ప్రసంగం ముగియగానే సెనెటర్లను ఆయనకు పరిచయం చేయగా, మోదీ ఓపిగ్గా వారితో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా మోదీతో కరచాలనం చేసేందుకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఉత్సాహం చూపారు. కేవలం ముందు బెంచీల్లో ఉన్నవారే కాకుండా వెనుక బెంచీల్లో కూర్చున్నవారు కూడా మోదీ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ ఆటోగ్రాఫ్ ను కూడా పలువురు తీపిగుర్తుగా తీసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News