: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో కోదండరాం... విద్యార్థులతో భేటీ
తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో సందడి చేశారు. హైదరాబాదులోని ఉస్మానియాలోని ఆర్ట్స్ కాలేజీలోని విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, యూనివర్సిటీల్లో సమస్యలపై జేఏసీ స్టీరింగ్ సమావేశంలో చర్చించామని అన్నారు. అందరి సహకారంతో త్వరలో సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పొలిటికల్ జేఏసీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చేసేందుకు తన వంతు పోరాటం చేస్తానని ఆయన వారికి చెప్పారు.